- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ ప్రత్యేక ఫోకస్
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే సదుద్దేశ్యంతో భూ భారతిని అందుబాటులోకి తీసుకోచ్చింది.

దిశ, రంగారెడ్డి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే సదుద్దేశ్యంతో భూ భారతిని అందుబాటులోకి తీసుకోచ్చింది. ఈ భూభారతితో సమస్యలను బట్టి ఒక్కో అధికారికి బాధ్యత నిస్తూ పని విభజన చేసింది. దీంతో మండల స్థాయిలోనే 80 శాతం సమస్యలు పరిష్కారం అయ్యేందుకు బాధ్యతలు అప్పగించారు. ప్రజల నుంచి వచ్చిన ధరఖాస్తులను సమస్య ఆధారంగా అధికారులు, సిబ్బంది ఆన్లైన్ లో అప్లోడ్ చేశారు. భూ సమస్య పరిష్కారం దిశగానే అధికారులు అడుగులు వేయాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండే సమస్యలకు సరియైన కారణం వివరించాలని కూడా రెవెన్యూ అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది. ఈ ఆగస్టు 15వ తేదీ వరకు రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన సమస్యలు పూర్తిగా ప్రక్షాళన చేయాలనే నిర్ణయంతో అధికారులు అడుగులు వేస్తోన్నారు. ప్రతి రోజు రెవెన్యూ సదస్సుల్లోని దరఖాస్తులపై కలెక్టర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
రెండు సమస్యలే ప్రధానం...
రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లో 21,200 మంది భూ సమస్యలపై సదస్సుల్లో దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దాదాపు 20 రోజులు జిల్లాలోని 613 రెవెన్యూ గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో భూ భాధితులు పెద్ద ఎత్తున దరఖాస్తులు అధికారులకు ఇవ్వడం గమనార్హం. అయితే ప్రధానంగా రూరల్ మండలాల్లోనే భూ సమస్యలు అధికంగా ఉండటంతో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. అర్భన్ మండలాల్లో పెద్దగా సమస్యలు లేవనే చెప్పాలి. కానీ ఉన్న రెండు మూడు దరఖాస్తులు వివాధ స్పధమైన భూములేనని తెలుస్తోంది. ఇలాంటి భూములను చాల సున్నితంగా పరిష్కారించాలని అధికారులు వివరిస్తున్నారు. అధికారులకు వచ్చిన ధరఖాస్తుల్లో ప్రధానంగా రెండు సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకటి డీఎస్ పెండింగ్, మరోకటి ఎక్స్టేంట్ కరెక్షన్ పైనే అత్యధికంగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. అధికారులకు అందిన దరఖాస్తుల్లో త్వరితగతిన అమోదం అయ్యే వాటికి నోటీసులు ఇచ్చి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. దరఖాస్తుదారులు పెట్టిన అర్జీలు అర్ధంకాకపోతే సదరు రైతుతో నేరుగా మాట్లాడి సమస్య తెలుసుకుంటున్నారు. దాంతో సమస్యకు పరిష్కారం చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
మంచాలలోనే అత్యధిక ఫిర్యాదులు...
రెవెన్యూ సదస్సుల్లో అత్యధికంగా మంచాల,యాచారం, కందుకూర్, అబ్ధుల్లాపూర్మెట్టు, షాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా అర్భన్ మండలాల్లోనే వచ్చాయి. రూరల్ మండలాల్లో అతి తక్కువగా కేశంపేట్, కొత్తూర్ మండలాల్లోనే ఉండటం విశేషం. అయితే ఈ సమస్యలన్ని యుద్ద ప్రతిపాదికన ప్రభుత్వ ఆదేశాలతో ఆగస్టు 15 నాటికి పూర్తిగా సమస్యలు పరిష్కారం చేస్తామని కలెక్టర్ హామీ ఇస్తున్నారు.
అప్రూవల్ వైపే అధికారులు మొగ్గు...
రైతులు కార్యాలయాల చూట్టు తిరిగేందుకు అవస్థలు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను గ్రామాల్లో ఏర్పాటు చేసింది. ఈ సదస్సుల్లో వచ్చిన సమస్యలను క్షుణంగా రైతుల వద్ద తెలుసుకోని పరిష్కారం వైపే ఉండాలని ప్రభుత్వం సూచన. అదే పద్దతిలో జిల్లా కలెక్టర్ ఆర్డీవో, తహశీల్ధార్లతో పలుమార్లు సమావేశాలు పెట్టి అప్లికేషన్ తిరస్కరణకు ప్రాధాన్యత ఇవ్వోద్దని తెలిపారు. రెవెన్యూ యాక్ట్కు విరుద్దంగా అప్లికేషన్ ఉన్నప్పడు రైతుకు కారణం వివరిస్తూ నోట్ వ్రాయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అప్రూవల్ వైపే అధికారులు ఆలోచన చేయాలని సూచించారు.






