- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల వైద్య సేవలకు అండగా సీఎం సహాయనిధి : ఎమ్మెల్యే కాలే యాదయ్య
చేవెళ్లలో ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

పేదల వైద్య సేవలకు అండగా సీఎం సహాయనిధి : ఎమ్మెల్యే కాలే యాదయ్య
చేవెళ్లలో ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
దిశ చేవెళ్ల: పేదల ఆరోగ్య సంరక్షణలో సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కీలకపాత్ర పోషిస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, నవాబ్ పేట్, శంకర్ పల్లి, షాబాద్, మొయినాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.65 లక్షల 67 వేల విలువైన 145 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. ఖరీదైన చికిత్సకు వెనుకాడకుండా ప్రజలు ఈ సహాయాన్ని వినియోగించుకోవాలి. సీఎం సహాయనిధి రాజకీయాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉంది. అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెంటయ్య గౌడ్, బేగరి రాములు, మర్పల్లి కృష్ణారెడ్డి, బండారి ఆగిరెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, గోనే ప్రతాప్ రెడ్డి, సున్నపు వసంతం, వీరేందర్ రెడ్డి, జహంగీర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






