- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తృటిలో తప్పిన పెను ప్రమాదం
by Batti.Sumithra |
తలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం కారు- కోళ్ల వ్యాన్ ఢీకొన్న సంఘటనతో పెను ప్రమాదం తప్పింది.

X
దిశ, తలకొండపల్లి : తలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం కారు- కోళ్ల వ్యాన్ ఢీకొన్న సంఘటనతో పెను ప్రమాదం తప్పింది. కేశంపేట మండలంలోని లింగధన గ్రామానికి చెందిన రఘుపతి రెడ్డి, నారాయణరెడ్డి, అనసూయమ్మ అనే ముగ్గురు కారులో ఆసుపత్రి నిమిత్తం హైదరాబాదుకు వెళుతున్న సమయంలో జంగారెడ్డి పల్లి గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న కోళ్ల వ్యాన్ ఢీకొనడంతో అనసూయమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలై కాలు విరగడంతో పాటు, మిగతా ఇద్దరికీ స్వల్ప గాయాలు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడ్డ వారిని వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
Next Story






