Cheetah: రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం.. తీవ్ర భయాందోళనలో స్థానికులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-12 05:10:28  IST  )

రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది.

Cheetah: రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం.. తీవ్ర భయాందోళనలో స్థానికులు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) పరిధిలోని రాజేంద్రనగర్‌ (Rajendra Nagara)లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. ఇవాళ ఉదయం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం (Professor Jayashankar Telangana University)లో మార్నింగ్ వాకింగ్‌కు వచ్చిన వారు చిరుతను చూశారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చిన చిరుత జనాలను గమనించి చెట్ల పొదల్లోకి వెళ్లిపోయినట్లుగా వాకర్స్ తెలిపారు. అదేవిధంగా వారు చిరుత పాద‌ ముద్రలను కూడా గుర్తించారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో చిరుత సంచారం చేస్తోందనే విషయం అందరికీ తెలియడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

కాగా, క్యాంప‌స్ (Campus) ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇంతకు ముందు కూడా చిరుత సంచ‌రించింది. నాడు అటవీ శాఖ (Forest Department) అధికారులు బోన్లు ఏర్పాటు చేసి చాకచక్యంగా చిరుత‌ను బంధించారు. అయితే, చిరుత పులి శంషాబాద్ (Shamshabad), గ‌గ‌న్‌ప‌హాడ్‌ (Gaganpahad)లోని రిజర్వ్ ఫారెస్ట్ (Reserve Forest) ప్రాంతంలో ఉండి హిమాయత్‌సాగర్ (Himayath Sagar), శంషాబాద్ (Shamshabad), రాజేంద్రనగర్ (Rajendranagar), మొయినాబాద్‌ (Moinabad)లోని గ్రామాల చుట్టూ సంచ‌రిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

Next Story