- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 2 కోట్లు.. ఫార్చునర్ కారు! కౌన్సిలర్లకు చైర్మన్ అభ్యర్థి బంపర్ ఆఫర్
ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు ఇవ్వడం నేడు సాధారణ విషయంగా మారింది. అయితే తాజా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ ఎన్నికకు జై కొడితే కౌన్సిలర్ అభ్యర్థులకు కాబోయే చైర్మన్ ఏకంగా రూ. 2 కోట్ల నగదు, ఫార్చునర్ కారు ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు చర్చ సాగుతోంది.

దిశ, చేవెళ్ల : ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు ఇవ్వడం నేడు సాధారణ విషయంగా మారింది. అయితే తాజా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ ఎన్నికకు జై కొడితే కౌన్సిలర్ అభ్యర్థులకు కాబోయే చైర్మన్ ఏకంగా రూ. 2 కోట్ల నగదు, ఫార్చునర్ కారు ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు చర్చ సాగుతోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 వార్డులు ఉండగా కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7, బీజేపీ 4, స్వతంత్రులు 5 చోట్ల గెలిచారు. చైర్మన్ కావాలంటే మ్యాజిక్ ఫిగర్ 14 కాగా 10 మంది అభ్యర్థులున్న కాంగ్రెస్ పార్టీ ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు, ఒక స్వతంత్ర అభ్యర్థితో నగర శివారులోని రిసార్ట్స్‌లో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి నేతృత్వంలో మొయినాబాద్ చైర్మన్ ఎన్నిక కోసం గెలుపొందిన అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వివరాలు తీసుకుంటున్నారు. అయితే అంతకుముందే బీజేపీ ముగ్గురు అభ్యర్థులతో లోపాయికారికంగా రూ. 2 కోట్ల నగదు, ఫార్చునర్ కారు ఇస్తామని కాంగ్రెస్ ఒప్పందం చేసుకోగా.. విషయం బయటకు రావడంతో వారు మద్దతు ఉపసంహరించుకున్నట్లు తెలిసింది.
రెబల్స్ మద్దతుతో?...
బీజేపీ అభ్యర్థులు ప్లేట్ ఫిరాయించడంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ అధిష్టానం స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఇద్దరు బీజేపీ రెబల్స్, ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్ మద్దతు ఇస్తుండగా, అందులో కాంగ్రెస్, బీజేపీ రెబల్స్ డిప్యూటీ చైర్మన్ ఇస్తేనే మద్దతు ఇస్తామని కండిషన్ పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే ఒక బీజేపీ రెబల్ కాంగ్రెస్ పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రంజిత్‌రెడ్డి రంగంలోకి దిగి చైర్మన్ పదవి దక్కించుకునే విధంగా వ్యూహ రచనలు చేస్తున్నారు.






