- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడవద్దు.. గడ్డం రంజిత్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఓడినా చివరి రక్తపు బొట్టు వరకు వికారాబాద్ ప్రజల కోసమే అండగా ఉంటామని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కార్యకర్తలను ధైర్యపడవద్దని సూచించారు.

దిశ, మర్పల్లి : అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఓడినా చివరి రక్తపు బొట్టు వరకు వికారాబాద్ ప్రజల కోసమే అండగా ఉంటామని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కార్యకర్తలను ధైర్యపడవద్దని సూచించారు. బుధవారం మోమిన్పేట్ మండలం ఏజీఆర్ ఫంక్షన్ హాల్ లో వికారాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలు పార్టీ నాయకుల సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమి నుండి పాఠాలు నేర్చుకుందాం భవిష్యత్తులో మీ వెంట నేనుంటా నా వెనక మీరు రండి కలిసికట్టుగా పని చేద్దాం దేనికైనా సిద్ధం నా కోసం పనిచేసిన కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు.
ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజాతీర్పును గౌరవిస్తూ అనునిత్యం పార్టీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పై పోరాడుదాం అన్నారు. వారి నాయకులు కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పదేళ్లపాటు పాలించే అవకాశం కల్పించిన సమయములో ఎలా అయితే పని చేశామో ప్రస్తుత పరిస్థితులలో కూడా ప్రతి దశలో ప్రజల పక్షాన నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






