- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిఆర్ఎస్ పాలన "జంగిల్ రాజ్ పాలన": తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
పురపాలక సంఘం ఎన్నికల నిర్వహణలో అతి ముఖ్య ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 28న ప్రారంభమై, 30న శుక్రవారం ముగింపు కానుంది.

దిశ తాండూర్ టౌన్: పురపాలక సంఘం ఎన్నికల నిర్వహణలో అతి ముఖ్య ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 28న ప్రారంభమై, 30న శుక్రవారం ముగింపు కానుంది. తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు వేసే కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... గత ఐదేళ్ల టీఆర్ఎస్ పాలనలో తాండూర్ మున్సిపల్ పరిపాలన "జంగిల్ రాజ్ పాలన" గా కొనసాగిందని అన్నారు.
తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో అడుగు అడుగునా అభివృద్ధిని క్షీణిస్తూ, తాండూర్ పట్టణ ప్రజల సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యారని, 2023 శాసనసభ ఎన్నికల్లో తాండూర్ ప్రజలు ఓటు రూపంలో సరైన బుద్ధి చెప్పారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల వ్యవధిలోనే తాండూర్ పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, మరో రెండేళ్ల పాలనలో తాండూర్ పట్టణం రూపు రేఖలు మార్చడంలో తాండూర్ ఎమ్మెల్యేగా కృషి చేస్తానని, అదేవిధంగా గత ఐదేళ్ల టీఆర్ఎస్ పాలనలో తాండూర్ పట్టణంలో అభివృద్ధి ముసుగులో శిలాఫలకాలకే పరిమితం చేస్తూ, తాండూర్ పట్టణ ప్రజలను మోసం చేసిన ఘనత బిఆర్ఎస్ పాలనదే.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల ప్రజా పాలనలో తాండూర్ పట్టణంలో అభివృద్ధిపై, గత బి ఆర్ ఎస్ పాలనలో అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలంటూ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి సవాల్ విసిరారు. జరగబోయే పురపాలక సంఘం ఎన్నికల్లో తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజారిటీ స్థానాలు గెలుపొంది తాండూర్ బల్దియా చైర్మన్ ను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ, నైతిక విలువలు, ప్రజాస్వామ్య సిద్ధాంతంతో ఏర్పడిందని, తాండూర్ కాంగ్రెస్ పార్టీ తరపున బల్దియా చైర్మన్ అభ్యర్థిగా ఎంపికలో ఎలాంటి అనుమానాలు లేకుండా 36 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 36 వార్డుల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






