- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల భరోసా
ఆమనగల్ మండలం సీతారాం నగర్ గ్రామపంచాయతీ, పులిగొనిపల్లి తండాలో కలకలం సృష్టించిన తల్లి, కొడుకుల హత్య ఉదంతం తమను కలిచి వేసిందని సర్పంచ్ ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు లక్ష్మీ నర్సింహా రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ గంప వెంకటేష్ విచారం వ్యక్తం చేశారు.

దిశ, ఆమనల్ : ఆమనగల్ మండలం సీతారాం నగర్ గ్రామపంచాయతీ, పులిగొనిపల్లి తండాలో కలకలం సృష్టించిన తల్లి, కొడుకుల హత్య ఉదంతం తమను కలిచి వేసిందని సర్పంచ్ ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు లక్ష్మీ నర్సింహా రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ గంప వెంకటేష్ విచారం వ్యక్తం చేశారు. బుధవారం బీఆర్ఎస్ నేతలతో కలిసి పులిగొని పల్లి తండాలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తండాలో జరిగిన సంఘటన అత్యంత దారుణమైనదని ఆవేదన వ్యక్తం తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన చిన్నారి ప్రణీత ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆమనగల్ కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్న చిన్న కూతురు పావనిను ఓదార్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పిల్లల విద్యాభ్యాసం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. నిన్న జరిగిన సంఘటన అత్యంత దారుణమైన ఘటన అని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి 10,000/-, మాజీ డీసీసీబీ డైరెక్టర్ గంపా వెంకటేష్ గుప్తా 5,000/-, సర్పంచ్ శ్రీను నాయక్ 5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్లకుంట సర్పంచ్ రామచందర్ నాయక్, మాజీ రైతు సంఘం డైరెక్టర్ జోగు వీరయ్య, నాయకులు లాయక్ అలీ, బద్రి నాయక్,మహేష్ గౌడ్,హేమా నాయక్,శాంతి లాల్ పాల్గొన్నారు.






