Rajiv Gandhi International Airport కు బాంబు బెదిరింపు

by Jakkula.Mamatha |   (  Updated:2025-09-28 06:46:01  IST  )

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టారని ఈ–మెయిల్ వచ్చింది.

Rajiv Gandhi International Airport కు బాంబు బెదిరింపు
X

దిశ, గండిపేట : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టారని ఈ–మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆదివారం ఉదయం 6:23 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఈమెయిల్ వచ్చింది. ఎయిర్ పోర్టు బిల్డింగ్ సమీపంలో బాంబులు పెట్టామని అందులో ఉంది. ఈ మేరకు భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమై ఎయిర్పోర్టు బిల్డింగ్ తో పాటు పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story