బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నాయ‌కులు

by Ratna Kumari |

పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందని మాజీ మంత్రి, మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నాయ‌కులు
X

దిశ, రాజేంద్రనగర్: రానున్న గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రాజేంద్రనగర్ డివిజన్ లో చేరికలు ప్రారంభమయ్యాయి. ఆదివారం గగన్ పహాడ్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు శీలం తిరుపతిరెడ్డి దాదాపు 100మంది కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి సబితా ఇంద్రారెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జి కార్తీక్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. కేసీఆర్‌ అభివృద్ధి పితామహుడని, తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతిపథంలో అగ్రగామిగా నిలిపిన దార్శనిక పాలకుడని పేర్కొన్నారు.కెసిఆర్ పదేళ్లలో జనారంజక పాలన అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్లు గడిచిన ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలం చెందిందన్నారు. ఏ మొహం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. పార్టీకి కష్ట కాలంలో పనిచేసే కార్యకర్తలను ఎప్పుడు గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ మైలార్ దేవ్ పల్లి, హైదర్ గూడ డివిజన్ల అధ్యక్షులు పోరెడ్డి ధర్మారెడ్డి, ఎస్.వెంకటేష్, చెట్టిగారి నరేందర్ రావు, కోలన్ సుభాష్ రెడ్డి, సూరెడ్డి కృష్ణారెడ్డి, రమేష్ ముదిరాజ్, రాము యాదవ్, ప్రవీణ్, రమేష్ భాయ్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story