బైక్ దొంగల ముఠాను పట్టుకొని రిమాండ్‌కు తరలింపు

by Kodari Anjali |

బైక్ దొంగల ముఠాను పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.

బైక్ దొంగల ముఠాను పట్టుకొని రిమాండ్‌కు తరలింపు
X

దిశ, చేవెళ్ల: 2026 ఏప్రిల్ నెలలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ దొంగతనాల కేసులలో ఈనెల 2వ తేదీన మొయినాబాద్ క్రైమ్ టీమ్ పోలీస్ గస్తీ తిరుగుతుండగా, మొయినాబాద్-సూరంగల్ బైపాస్ వద్ద హరిజన రామకృష్ణ, బద్దుల విజయ్ కుమార్ అను ఇద్దరు వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని యమాహా వాహనంపై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ముఫ్టీలో ఉన్న క్రైమ్ టీమ్ వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. గత ఏప్రిల్ నెలలో మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం గోవింద్‌పల్లి గ్రామానికి చెందిన హరిజన రామకృష్ణ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరో వ్యక్తి బద్దుల విజయ్ కుమార్ గత కొంతకాలంగా ఇంకొంత మంది వ్యక్తులు మొయినాబాద్‌లో (04) బైకులను, చేవెళ్లలో (01) బైకును, కూకట్‌పల్లి పరిధిలో (01) బైకును మొత్తం (06) బైకులను దొంగతనం చేసి ఈ బైకులను వారి ఇంటి దగ్గర దాచిపెట్టగా, పోలీసులు (06) బైకులను స్వాధీనం పర్చుకొన్నారు.

మీ సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి..

దొంగతనం చేసిన వ్యక్తులను ఈనెల 3వ తేదీ న అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజేంద్రనగర్ కోర్టు వద్ద హాజరుపర్చారు. ఈ కేసులను ఛేదించిన మొయినాబాద్ సీఐ మల్లికార్జున్ రెడ్డిని, క్రైమ్ ఇన్స్పెక్టర్ CH ఉపేందర్‌ని, ఎస్సై సుభాష్‌ను వారి బృందాన్ని చెవెళ్ల జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్, ఏసీపీ బీ. కిషన్ ప్రత్యేకంగా అభినంధించారు. ఫ్యూచర్ సిటి పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద నాణ్యమైన సీసీటీవీలను కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, బైకులకు తాళం చెవి బైకుకు ఉంచరాదని, వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ అమర్చుకోవాలని సూచించారు. ఎవరైనా వ్యక్తులు మీ ఊరిలో/కాలనీలలో రాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి లేదా అత్యవసర పరిస్థితుల్లో 100 కు కాల్ చేయాలని పిలుపు నిచ్చారు.

Next Story