ఫిర్యాదారులతో స్నేహపూర్వకంగా మెలగాలి

by Elthuri vijay kumar |

ఫిర్యాదారులతో పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలని, విధుల పట్ల అధికారులు నిబద్ధతతో పనిచేయాలని శంషాబాద్ డీసీపీ బి.రాజేష్ అన్నారు.

ఫిర్యాదారులతో స్నేహపూర్వకంగా మెలగాలి
X

ఫిర్యాదారులతో స్నేహపూర్వకంగా మెలగాలి

విధుల పట్ల నిబద్దతతో పనిచేయాలి

శంషాబాద్ డీసీపీ బి.రాజేష్

కడ్తాల్ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ

రికార్డులు పరిశీలన, విధులు నిర్వహణపై ఆరా..

దిశ,కడ్తాల్: ఫిర్యాదారులతో పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలని, విధుల పట్ల అధికారులు నిబద్ధతతో పనిచేయాలని శంషాబాద్ డీసీపీ బి.రాజేష్ అన్నారు. శనివారం అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఏసీపీ లక్ష్మీనారాయణతో కలిసి కడ్తాల్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి విధులు నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, కేసులను త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని, అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా నిబద్ధతతో పనిచేసి ప్రజల్లో పోలీసులకు నమ్మకాన్ని విశ్వసాన్ని పెంపొందించే విధంగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ సి.హెచ్ గంగాధర్, ఎస్ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్, సిబ్బంది ఉన్నారు.

Next Story