ఆటోలో మర్చిపోయిన బ్యాగ్‌.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు

by Kodari Anjali |

ఓ వ్యక్తి ఆటోలో పొగోట్టుకున్న బ్యాగ్‌ను పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి బాధితుడికి అప్పగించారు.

ఆటోలో మర్చిపోయిన బ్యాగ్‌..  గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
X

దిశ, రాజేంద్రనగర్: ఆటోలో మర్చిపోయిన బ్యాగ్‌‌ను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సీసీటీవీ కెమెరాలు, టెక్నాలజీ సాయంతో ట్రాక్ చేసి గంటల వ్యవధిలో బాధితునికి అందజేశారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నివాసం ఉండే కేశవులు (26) శనివారం తన సోదరీమణులు కిమ్, సోని, అనితలతో కలిసి ఆరాంఘర్ కు వచ్చాడు. అక్కడి నుండి ఉడంగడ్డకు వెళ్లేందుకు తాను చదువుకున్న సర్టిఫికెట్లతో ఉన్న బ్యాగ్‌తో ఆటోలో ఎక్కి మెహఫిల్ హోటల్ దగ్గర దిగారు. తన బ్యాగ్‌ ఆటోలో మర్చిపోయినట్లు గుర్తించాడు. వెంటనే బాధితుడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ కెమెరాలు, టెక్నాలజీ సాయంతో ఆటోను గుర్తించి డ్రైవర్‌కు కాల్ చేశారు. వెంటనే ఆటలో ఉన్న బ్యాగును తీసుకుని ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. సర్టిఫికెట్లతో ఉన్న బ్యాగును బాధితునికి సీఐ సత్యనారాయణ అందజేశారు.

Next Story