- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్నేహితులే హంతకులా?
ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని అతని స్నేహితులే దారుణంగా హత్య చేసి చెట్లపొదల్లో పడవేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

దిశ, షాద్ నగర్ : ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని అతని స్నేహితులే దారుణంగా హత్య చేసి చెట్లపొదల్లో పడవేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. షాద్ నగర్ సీఐ కె. సీతారాం కథనం ప్రకారం... నాగర్ కర్నూల్ జిల్లా మంగనూరు గ్రామానికి చెందిన ఎండి.హసన్ (36) ఈనెల 23న అదృశ్యమైనట్టు హసన్ సోదరుడు ఎండి.హాజీ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన సోదరుడు ఈనెల 22న అతని స్నేహితులైన ఏనుగంటి అరవింద్, వీరకారి శివాజీ లతో కలిసి మారుతి ఎక్సెల్( టీఎస్ 31 కే 4790) కారులో హైదరాబాద్ వెళ్లాడని, అదే రోజు సాయంత్రం షాద్ నగర్ టోల్ గేట్ దాటినట్టు హసన్ తన భార్యతో ఫోన్ లో మాట్లాడాడు. హసన్ మొబైల్ నుంచి కుటుంబ సభ్యులకు తన లొకేషన్ ను షేర్ చేశాడు. అనంతరం హసన్ రెండు మొబైల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు హసన్ ప్రయాణించిన కారు లొకేషన్ వైపు సాయంత్రం 7:40 సమయంలో వెళ్ళినట్లు, అనంతరం 9:30 నిమిషాలకు అక్కడి నుంచి జాతీయ రహదారి పైకి వచ్చి జడ్చర్ల వైపు వెళ్లినట్లు గుర్తించారు. హసన్ బంధువులు గురువారం అతను పంపిన చివరి లొకేషన్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా కాశీరెడ్డి గూడా గ్రామ శివారులోని ట్రూ ల్యాండ్ మార్క్ వెంచర్ చెట్ల పొదల్లో హసన్ మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. వడ్ల వ్యాపార లావా దేవి లకు సంబంధించిన ఆర్థిక వివాదాల నేపథ్యంలో మృతుడి స్నేహితులైన అరవింద్, శివాజీలు మృతుడితో గొడవపడి గుర్తుతెలియని ఆయుధంతో తలపై గాయపరిచి హత్య చేసి మృతదేహాన్ని చెట్లపొదల్లో పడవేసి ఉంటారని మృతుని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మిస్సింగ్ కేసును అనుమానాస్పద హత్య కోణంలో విచారిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులుగా భావిస్తున్న అరవింద్, శివాజీలు పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ సీతారాం తెలిపారు.






