- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్ వాడి ఉపాధ్యాయురాలికి అత్యుత్తమ పురస్కారం
అంగన్ వాడి టీచర్ చింటూ సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుంది.

దిశ, షాద్ నగర్ : అక్షరాలు దిద్దిస్తూ అంకితభావంతో తన వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ సామాజిక బాధ్యతగా సమాజంలో మూఢనమ్మకాలపై, ఆడపిల్లలపై జరుగుతున్న వివక్షతను వెలుగులోకి తీసుకువచ్చిన అంగన్ వాడి ఉపాధ్యాయురాలు చింటూ సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుంది. ఫరూఖ్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామపంచాయతీలోని మాన్ సింగ్ తండాలో అంగన్ వాడి ఉపాధ్యాయురాలుగా చింటూ విధులను నిర్వహిస్తోంది. తన విధులలో భాగంగా చిన్నారులకు అక్షరాలను దిద్దించడమే కాకుండా తన బాధ్యతగా సమాజ సేవకు పాల్పడుతుంది. తండాలో ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తూ నింపుతుంది. ఇటీవల తండాలో వరుసగా ఆడపిల్లలే పుట్టారంటూ ఓ ఆడ శిశువును దంపతులు విక్రయించారు. ఈ విషయాన్ని పసి గట్టిన చింటూ స్మైల్ టీమ్ సభ్యులకు సమాచారాన్ని అందించి వారి సహకారంతో శిశువును శిశు విహార్ కు తరలించారు. మరింత బాధ్యత యుతంగా తన విధులను కొనసాగిస్తానని అన్నారు. అంగన్ వాడి ఉపాధ్యాయురాలు చింటూ సేవలకు పురస్కారం లభించడం సంతోషంగా ఉందని, శభాష్ చింటూ అంటూ అంగన్ వాడి ఉపాధ్యాయురాలని మండల ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.






