రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

రోడ్డు ప్ర‌మాదంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న రాజేంద్ర న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ, రాజేంద్రనగర్ : రోడ్డు ప్ర‌మాదంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న రాజేంద్ర న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై పైడి నాయుడు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బాబుల్ రెడ్డి నగర్ సోనీ మార్బల్స్ షోరూం ముందు రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తి (25) ని ఓ వాహనం ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర రక్తస్రవమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మెరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుప‌త్రికి తరలించి కేసు నమోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Next Story