- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ సమస్య.. మా బాధ్యత
మణికొండ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

దిశ, గండిపేట : మణికొండ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీ సమస్య.. మా పరిష్కారం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి మమేకమవుతున్నారు. ఆదివారం మణికొండలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ప్రజలతో.. ప్రజల కోసం అనే కార్యక్రమాన్ని చేపట్టిన గులాబీ పార్టీ నాయకులకు స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఆదివారం చింతచెట్టు బట్టర్ ఫ్లై సర్కిల్ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలతో నాయకులు ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా దోమల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు తెలిపారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆనంద హోమ్స్ నిర్మాణ సంస్థకు చెందిన వాహనాలు రాత్రి పగలు తేడా లేకుండా తిరగడంతో రహదారులు చిద్రమవుతున్నాయని పేర్కొన్నారు.
దుమ్ము, ధూళి కారణంగా తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. కుక్కల బెడద కూడా అధికంగా ఉందని నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఇక కొన్ని రోజులుగా గుర్తింపు లేని వైద్యులు రోడ్డు పక్కన వైద్య శిబిరాలు నిర్వహిస్తూ, మందులు విక్రయించి అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఈ అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మణికొండ బీఆర్ఎస్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ్లతో పాటు కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, ఉపేంద్రనాథ్ రెడ్డి, అందే లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, యాలాల కిరణ్, జైరామ్, శ్రీధర్, మహమ్మద్ ఆరిఫ్, సుమనళిని, దేవి ప్రియ, వెంకట రామ్, బాబు రావు తదితరులు పాల్గొన్నారు.






