- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుమారుల చేతిలో మోసపోయిన 82 ఏళ్ల వృద్ధురాలు..
కుమారులు చేతిలో మోసపోయిన 82 ఏళ్ల వృద్ధురాలు.. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

దిశ, ఇబ్రహీంపట్నం: కుమారులు చేతిలో మోసపోయిన 82 ఏళ్ల వృద్ధురాలు.. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం గాజులగూడ గ్రామానికి చెందిన 82 ఏళ్ల కోమటిరెడ్డి సుశీలమ్మ తన ఇద్దరు కుమారుల చేతిలో మోసపోయానని, తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఉన్న 15 ఎకరాల వ్యవసాయ భూమిలో 13 ఎకరాలను ఇద్దరు కుమారుల పేరున రిజిస్ట్రేషన్ చేయించానని తెలిపారు. మిగిలిన 2 ఎకరాలను విక్రయించి వచ్చిన రూ.2.70 కోట్ల నగదును చిన్న కుమారుడు తీసుకున్నాడని ఆరోపించారు. కాగా ఆస్తి మొత్తం వారి చేతికి వెళ్లిన తర్వాత తనను పట్టించుకోవడం మానేశారని, కనీసం అన్నం కూడా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లగొట్టారని వాపోయారు. ప్రస్తుతం చెట్టు కిందే నివాసం ఉంటూ దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నానని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించి, తన డబ్బులు లేదా భూమిని తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని సుశీలమ్మ విజ్ఞప్తి చేశారు.






