చైర్మన్ పీఠంపైనే అందరి గురి.. మూడు పార్టీల పోటా పోటీ

by Ajay Maddhiboyina |

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆమనల్లు మున్సిపాలిటీ చైర్మన్, వార్డు రిజర్వేషన్లు శనివారం ఖరారయ్యాయి. చైర్మన్ పీఠం జనరల్ కు కేటాయించడంతో ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

చైర్మన్ పీఠంపైనే అందరి గురి.. మూడు పార్టీల పోటా పోటీ
X

దిశ, ఆమనగల్లు : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆమనల్లు మున్సిపాలిటీ చైర్మన్, వార్డు రిజర్వేషన్లు శనివారం ఖరారయ్యాయి. చైర్మన్ పీఠం జనరల్ కు కేటాయించడంతో ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చైర్మన్ పీఠం కోసం ఇప్పటినుండే పావులు కదుపుతున్నారు. 15 వార్డులలో ఎస్టీ 4, ఎస్సీ 2, బీసీ 1, జనరల్ మహిళ 4, జనరల్ 4 స్థానాలను కేటాయించారు.

ఆశావహులకు భంగపాటు

మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లపై గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. వార్డులు చైర్మన్ రిజర్వేషన్ల ఖరారుతో ఆశావహుల ఆందోళనకు విముక్తి కలిగింది. ఈ రిజర్వేషన్లు కొంతమందికి అనుకూలంగా, ప్రతికూలంగా వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతున్నప్పటి నుంచి కొంత మంది తాము కచ్చితంగా పోటీ చేస్తున్నామని ప్రచారం చేసుకున్నారు. కానీ తీరా రిజర్వేషన్లు విడుదలతో అనేక మంది ఆశావహులు మౌనం వహించారు.

6వ వార్డులో అత్యధికం..

మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో మొత్తం 16,984 ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 8,509 ఉండగా.. పురుష ఓటర్లు 8,475 ఉన్నారు. కాగా.. 1వ వార్డులో 847, 2వ వార్డులో 917, 3వ వార్డులో 1394, 4వ వార్డులో1123, 5వ వార్డులో 939, 6వ వార్డులో 1599, 7వ వార్డులో 956, 8వ వార్డులో 1155, 9వార్డులో 817, 10వ వార్డులో 1,258, 11వ వార్డులో 1,478,12వ వార్డులో 1,161, 13వ వార్డులో 1,173,14వ వార్డులో 1,097,15వ వార్డులో 1,070 ఓటర్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ గురి : ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ జనరల్ కు రిజర్వు కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఆ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో అధికారం చేపట్టిన బీజేపీ.. ఆమనగలులో తన పట్టును కాపాడుకోవడానికి మరోసారి విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ సైతం తమ ఉనికిని చాటలని ముఖ్యమైన అభ్యర్థుల వేట మొదలుపెట్టింది. చైర్మన్ జనరల్ కు రిజర్వు కావడంతో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.

Next Story