- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెవెన్యూ అధికారులపై దాడిని ఖండిస్తూ ఆదిభట్ల సర్కిల్ అధికారుల నిరసన
తుర్కయంజాల్‌లో విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారులపై ఇటీవల జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ శుక్రవారం ఆదిభట్ల సర్కిల్-15, శంషాబాద్ జోన్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు నిరసన చేపట్టారు.

దిశ, తుర్కయంజాల్: తుర్కయంజాల్‌లో విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారులపై ఇటీవల జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ శుక్రవారం ఆదిభట్ల సర్కిల్-15, శంషాబాద్ జోన్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు బ్లాక్ బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. తుర్కయంజాల్ ప్రాంతంలో భూ వివాదానికి సంబంధించిన విధుల నిర్వహణ కోసం వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడి చేయడం అత్యంత ఖండనీయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్భయంగా నిర్వహించేలా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, బెదిరింపులు, విధి నిర్వహణకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిక్షపతి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఎస్. శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్లు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, సిస్టమ్ ఆపరేటర్లు, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.






