ఎస్ఐని ఢీ కొట్టిన నిందితుల రిమాండ్

by Ratna Kumari |

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి అతివేగంగా వెళ్తూ అడ్డుకోబోయిన ఎస్సై ను ఢీ కొట్టి 400 మీటర్లు లాకెళ్లిన నిందితులను సోమవారం యాచారం పోలీసులు రిమాండ్ కు తరలించారు.

ఎస్ఐని ఢీ కొట్టిన నిందితుల రిమాండ్
X

దిశ, యాచారం : ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి అతివేగంగా వెళ్తూ అడ్డుకోబోయిన ఎస్సైను ఢీ కొట్టి 400 మీటర్లు లాకెళ్లిన నిందితులను సోమవారం యాచారం పోలీసులు రిమాండ్ కు తరలించారు. సీఐ నందీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ కు చెందిన పారంద నితిన్ (24), కోహెడకు చెందిన కేసరి శ్రీకర్ (27) మాల్ గ్రామానికి వెళ్లి తిరిగి వెళ్తుండ‌గా.. యాచారం మండల కేంద్రానికి చేరుకోగానే మొండి గౌరెల్లి, గ్రామానికి చెందిన దంపతుల ద్విచక్ర వాహనాన్ని ఢీ కొని అతివేగంగా వెళ్లారు. ఇదే క్ర‌మంలో ఎస్సై మధును కూడా ఢీ కొట్టడంతో పాటు దాదాపు 400 మీట‌ర్ల వ‌ర‌కు లాక్కెళ్లారు. దీంతో ఆ ఎస్సై కారు పై నుంచి దూకాడు. పోలీసులు ఖానాపూర్ వద్ద వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకొని నిందితులపై కేసులను నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.

Next Story