మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు వెళ్తుండగా ప్రమాదం

by Jakkula.Mamatha |

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు వెళ్తున్న విద్యార్థులను రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది.

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు వెళ్తుండగా ప్రమాదం
X

దిశ, పెద్దేముల్: మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు వెళ్తున్న విద్యార్థులను రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. బైక్‌ను బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో తండ్రీకూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దన్నామడుగు తండా - తట్టెపల్లి గ్రామాల మధ్య ఆదివారం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. బండమీది పల్లి గ్రామానికి చెందిన చింతల్ సంజీవ తన కుమార్తె భవాని (10 సంవత్సరాలు, 5 తరగతి), అన్న కుమారుడు ఆకాష్‌లను 7వ తరగతి, గొట్లపల్లి మోడల్ స్కూల్‌లో జరుగుతున్న ప్రవేశ పరీక్షకు తన మోటార్ సైకిల్‌పై తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా ఓమ్లా నాయక్ తండా కు చెందిన బొలెరో వాహనం అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంజీవ ఎడమ కాలు విరగగా, కుమార్తె భవాని కుడి కాలు ఫ్రాక్చర్ అయింది. వెనుక కూర్చున్న మరో విద్యార్థి ఆకాష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం తాండూర్ లోని ఆసుపత్రికి తరలించారు. బొలెరో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.

Next Story