ఓ వ్యక్తిని నడిరోడ్డు పై చెప్పుతో కొట్టిన మహిళ..ఎందుకో తెలుసా

by Disha Web Desk 20 |
ఓ వ్యక్తిని నడిరోడ్డు పై చెప్పుతో కొట్టిన మహిళ..ఎందుకో తెలుసా
X

దిశ, మీర్​పేట్​ : కారును ఢీకొట్టాడని ఓ వ్యక్తిని నడిరోడ్డు మీద చెప్పుతో కొట్టి హల్​చల్​ సృష్టించిన మహిళపై మీర్ పేట్​ పోలీసులు మోటార్ వెహికిల్ యాక్ట్​, టౌన్ న్యూసెన్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. మీర్​పేట్​ ఇన్​స్పెక్టర్​ మహేందర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 16న రాత్రి 10.30 గంటల సమయంలో టీకేఆర్​ కమాన్​ రూట్​లో నిబంధనలకు విరుద్దంగా పోలీస్​ స్టిక్కర్​ అతికించిన TS 07 GL 9691నెంబర్​ గల ఎర్ర కారులో ఓ మహిళ ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో వెనుకాలే వస్తున్న ఓ ఇన్నోవా కారు ఢీకొట్టింది.

దీంతో ఎర్రకారులో నుంచి దిగిన సదరు మహిళ ఎర్ర కారు మీద ఉన్న పోలీస్​ స్టిక్కర్​ ను చూపిస్తూ పోలీస్​కారునే ఢీ కొడుతావారా అంటూ దుర్భాషలాడింది. ఆగ్రహంతో ఊగిపోతూ పదివేలు తీయి అంటూ చెప్పుతో ఎడా పెడా కొట్టింది. ఇదంతా గమనించిన స్థానికులు కారును చుట్టుముట్టి సమూదాయించిన ఏమాత్రం తగ్గకుండా హల్​చల్​ సృష్టించింది. వెంటనే అతనికి క్షమాపణ చెప్పాలని స్థానికులు పట్టుబట్టారు. నేను క్షమాపణ చెప్పేదే లేదని తెగేసి చెప్పడంతో స్థానికులు సైతం మొండి పట్టుపట్టి సదరు వ్యక్తికి మహిళతో క్షమాపణ చెప్పించారు.

సమాచారం అందుకున్న మీర్​ పేట్​ పోలీసులు కారుతో పాటు కారులో ప్రయాణిస్తున్న మహిళను పోలీస్​స్టేషన్​కు తరలించారు. నిబంధనలకు విరుద్దంగా కారుమీద పోలీస్​ స్టిక్కర్​ను అతికించడంతో పాటు నడిరోడ్డులో కారును ఆపి దురుసుగా ప్రవర్తించి వాహనాదారులకు తీవ్ర అసౌకర్యానికి గురిచేసిన మహిళపై మోటార్ వెహికిల్ చట్టం, టౌన్ న్యూసెన్స్ చట్టం కింద మీర్​పేట్​ పోలీసులు కేసును నమోదు చేశారు. ప్రయివేట్​ వాహనాలపై నిబంధనలకు విరుద్దంగా స్టిక్కర్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహేందర్​రెడ్డి హెచ్చరించారు.


Next Story

Most Viewed