- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్న ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
అన్న ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.

దిశ, వికారాబాద్ ప్రతినిధి : అన్న ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డేగావత్ తులసీ బాయి(23) వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. తులసి బాయి అన్న రాజు ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేస్తుంటాడు. అదే ఆసుపత్రిలో నల్లగొండ జిల్లా మునుగోడుకి చెందిన మౌనిక అనే యువతిని ఏడాది కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆమెను తన చెల్లి గదిలోనే ఉంచారు. ప్రేమికుల మధ్య గొడవలు జరిగి మౌనిక వెళ్లిపోయింది. అయితే గతంలో దిగిన ఫొటోలు పంపి మౌనికను రాజు బెదిరించినట్టు సమాచారం. దీంతో రాజు తనను వేధిస్తున్నాడని.. అందుకు అతని చెల్లి కానిస్టేబుల్ కూడా సహకరిస్తుందని వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో మౌనిక ఫిర్యాదు చేసింది. తన అన్న ప్రేమ వ్యవహారం వల్ల తాను ఇబ్బంది పడాల్సి వస్తుందని మనస్థాపంతో కానిస్టేబుల్ తులసిబాయి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు పోలీసులు.






