లారీ చ‌క్రాల కింద న‌లిగిన ప‌సిప్రాణం

by Ratna Kumari |

పిల్ల‌లులేని వృద్ధ దంప‌తుల‌కు ఆ ఇంట వెలుగులు నింపుతూ.. అల్లారుముద్దుగా పెరుగుతున్న ఆ చిన్నారి.. వృద్ధాప్యానికి ఆస‌రా అవుతుంద‌నుకుంటే విధి వంచించింది.

లారీ చ‌క్రాల కింద న‌లిగిన ప‌సిప్రాణం
X

దిశ, కొడంగల్ : పిల్ల‌లులేని వృద్ధ దంప‌తుల‌కు ఆ ఇంట వెలుగులు నింపుతూ.. అల్లారుముద్దుగా పెరుగుతున్న ఆ చిన్నారి.. వృద్ధాప్యానికి ఆస‌రా అవుతుంద‌నుకుంటే విధి వంచించింది. అతివేగంగా వ‌చ్చిన లారీ రూపంలో మృత్యువు ఆ పసి పాపను కబళించింది. కొడంగల్ పట్టణంలో సోమవారం చోటు చేసుకున్న‌ ఈ ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొడంగల్ పట్టణంలోని కార్గిల్ కాలనీకి చెందిన ఆయేషా (6) అనే చిన్నారి సోమవారం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లేందుకు పుస్తకాల సంచి భుజాన వేసుకుని బయలుదేరింది. పట్టణంలోని బస్టాండ్ ముందున్న ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో కర్ణాటక నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కర్ణాటక లారీ (KA 32 AA 1607) అతివేగంగా వచ్చి చిన్నారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయేషా లారీ చక్రాల కింద పడి నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే జరిగిన ఈ ఘోరాన్ని చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

Next Story