- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rangarajan : రంగరాజన్ పై దాడి కేసు... ఆరుగురు అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతినొందిన చిలుకూరు బాలాజీ ఆలయం(Chilukuri Balaji Temple) ప్రధానార్చకుడు రంగరాజన్(Rangarajan) పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతినొందిన చిలుకూరు బాలాజీ ఆలయం(Chilukuri Balaji Temple) ప్రధానార్చకుడు రంగరాజన్(Rangarajan) పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అన్ని రాజకీయ పార్టీల కీలక నేతలు ఆయనను పరామర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని హిందూ మత సంస్థలు రంగరాజన్ కు తమ మద్ధతు తెలుపుతూ.. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఈ దాడి కేసులో అరుగురిని అరెస్ట్ చేసినట్టు రాజేంద్రనగర్ డీసీపీ ప్రకటించారు. వీరిలో ఇద్దరు మహిళలు సహ నలుగురు యువకులు ఉన్నారు. వీరంతా ఖమ్మం, నిజామాబాద్ కు చెందిన వారీగా డీసీపీ తెలిపారు. కాగా ఈ దాడికి ప్రధాన కారకుడు వీరరాఘవరెడ్డిని ఏరోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే 2022లో వీరరాఘవరెడ్డి(Veera Raghava Reddy) అనే వ్యక్తి 'రామరాజ్యం'(Ramarajyam) పేరుతో ఓ సైన్యాన్ని నిర్మించాడు. దీని గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ.. రామరాజ్యం సైన్యం లో చేరాలంటూ ఓ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను నెట్టింట్లో విడుదల చేశాడు. వసతితో పాటు రూ. 20 వేల జీతం ఇస్తానని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో పలువురు యువతీ యువకులు ఈ సైన్యంలో చేరినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో తన సైన్యానికి నిధులు ఇవ్వాలని, భక్తులను తమ ఆర్మీలో చేర్పించాలని గుడి ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇంటికి వెళ్లి కోరగా ఆయన డానికి తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన వీరరాఘవరెడ్డి అతని అనుచరులు రంగరాజన్, అతని కుమారున్ని కొట్టారు. కాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రంగరాజన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చారు. నిందితులను ఎవరైనా సరే అరెస్ట్ చేసి కఠిననంగా శిక్షిస్తామని తెలియజేశారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్వయంగా రంగరాజన్ ఇంటికి వెళ్లి ఆయనను ఓదార్చారు. బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఫోన్లో పలకరించారు.






