యువతిని కాపాడిని హైడ్రా డీఆర్ఎఫ్ టీంకు రంగనాథ్ సత్కారం

by Ramesh Goud |

ఆత్మహత్యకు యత్నించిన యువతిని కాపాడిన హైడ్రా డీఆర్ఎఫ్ బృందాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (Hydra Commissioner AV Ranganath) సత్కరించారు.

యువతిని కాపాడిని హైడ్రా డీఆర్ఎఫ్ టీంకు రంగనాథ్ సత్కారం
X

దిశ, వెబ్ డెస్క్: ఆత్మహత్యకు యత్నించిన యువతిని కాపాడిన హైడ్రా డీఆర్ఎఫ్ బృందాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (Hydra Commissioner AV Ranganath) సత్కరించారు. మంగళవారం ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు హుస్సేన్ సాగర్ (Hussien Sagar) లో దూకింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన హైడ్రా డీఆర్ఎఫ్ బృందం (Hydra DRF Team) ఆ యువతిని కాపాడింది. దీంతో హుస్సేన్ సాగ‌ర్‌లో దూకి ఆత్మహ‌త్యకు య‌త్నించిన యువ‌తిని కాపాడిన హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది మార్షల్ ఫ‌కృద్దీన్‌, డీఆర్‌ఎఫ్ స‌హాయ‌క సిబ్బంది ఎ. ర‌మేష్‌, ఎన్‌. శ్రీ‌నివాస్‌, ఎండీ ఇమాముద్దీన్‌, కె. కార్తీక్ కుమార్‌ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు (Hydra Desaster Responce Force) ఎళ్లప్పుడూ అప్రమ‌త్తంగా ఉండాల‌ని రంగానాథ్ సూచించారు. అలాగే ప్రమాదం ఎలా వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో డీఆర్‌ఎఫ్ బృందాల అప్రమ‌త్తత‌తో కొంత‌మేర న‌ష్టాన్ని త‌గ్గించ‌గ‌ల‌మ‌న్నారు. మంగ‌ళ‌వారం సాగ‌ర్‌లోకి దిగ‌డానికి కూడా వీలు లేని చోట‌ తాళ్ల సాయంతో యువ‌తిని సుర‌క్షితంగా కాపాడార‌ని తెలిపారు. ఇక గత గురువారం భారీ వ‌ర్షం కుర‌వ‌గా.. ఒక్కసారిగా వ‌చ్చిన వ‌ర‌ద‌తో మూసీ న‌దిలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన డీఆర్‌ఎఫ్ సిబ్బందిని కూడా క‌మిష‌న‌ర్ అభినందించారు.

Next Story