Ramoji Rao : రేపు రామోజీరావు అంత్యక్రియలు..

by Sathputhe Rajesh |   (  Updated:2024-06-08 13:55:16  IST  )

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం కన్నుమూశారు.

Ramoji Rao : రేపు రామోజీరావు అంత్యక్రియలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం కన్నుమూశారు. కాగా, రామోజీరావు అంత్యక్రియలు రేపు(ఆదివారం) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయన మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున రేపు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. రేపు అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామోజీరావు పార్ధివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Next Story