గుడ్ న్యూస్.. TG ఎయిర్‍పోర్టులపై రామ్మోహన్ నాయుడు BIG అప్‍డేట్

by Prasad Jukanti |

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లతో పాటు ఆదిలాబాద్, కొత్తగూడెం, అంతర్గాం విమానాశ్రయాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక అప్‌డేట్ ఇచ్చారు.

గుడ్ న్యూస్.. TG ఎయిర్‍పోర్టులపై రామ్మోహన్ నాయుడు BIG అప్‍డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని ఎయిర్ పోర్టులపై అన్ని డిమాండ్లు పరిశీలిస్తున్నామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) అన్నారు. ఫీజబులిటీ ఉన్న చోట ఎయిర్ పోర్టుల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నం మామునూరు ఎయిర్‍పోర్టుకు (Mamnoor Airport) 3 నెలల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్ పోర్టు ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆదిలాబాద్ లో పెద్ద ఎయిర్ పోర్టు నిర్మించాలని కేంద్రం భావిస్తోందని సైనిక, పౌరుల అవసరాలకు అనుగుణంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు నిర్మించబోతున్నట్లు చెప్పారు. ఇందుకోసం సివిల్ ఏవియేషన్‍తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రక్షణశాఖ సైతం చెప్పిందని వెల్లడించారు. ఈ నెల 17న ఆదిలాబాద్ భూముల పరిశీలనకు అధికారులు వెళ్తారని, రక్షణ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశాక నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆదిలాబాద్ లో రక్షణ శాఖకు 360 ఎకరాలు ఉందని, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కావాల్సిన అనుకూలతు ఆదిలాబాద్ లో ఉన్నాయని చెప్పారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఎయిర్ పోర్టును రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక్కడ ఎయిర్ పోర్టు ప్రతిపాదనపై ఫీజబులిటీ నివేదిక సానుకూలంగా ఉందని చెప్పారు.

Next Story