TG: ఈఎన్సీ జనరల్‌గా రమేశ్‌బాబు

by Gantepaka Srikanth |

రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్)గా ఓవీ రమేశ్‌బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

TG: ఈఎన్సీ జనరల్‌గా రమేశ్‌బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్)గా ఓవీ రమేశ్‌బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటివరకు ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్)గా రమేశ్‌బాబు వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఈఎన్సీ(జనరల్)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా.. మొన్నటివరకు ఉన్న ఈఎన్సీ జనరల్ అమ్జద్ హుస్సేన్ గత నెల 31న ఉద్యోగ విరమణ చేశారు. దాంతో అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉన్నది. వారం రోజుల నుంచి భర్తీ చేయలేదు. కనీసం ఎవరికి ఇన్‌చార్జి బాధ్యతలు సైతం అప్పగించలేదు. అయితే.. శుక్రవారం ‘దిశ’ పేపర్‌లో ‘ఈఎన్సీ.. వేకెన్సీ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ప్రభుత్వం ఈ రోజు ఇన్‌చార్జి బాధ్యతలను రమేశ్‌బాబుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నారాయణపేటలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కె.బ్రహ్మానంద్‌ను కొడంగల్ (ఐసీ-3, మక్తల్) పరిధిలోని ఐడీ-9 విభాగానికి ఎఫ్‌ఏసీపై నియమించారు. అదేవిధంగా కరీంనగర్‌లో ఓ/ఓ ఈఎన్సీలో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న కె.రాధాకృష్ణకు ఐసీ-2, కరీంనగర్ పరిధిలో డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

Next Story