నేడు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

by Ajay Maddhiboyina |

తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన పార్టీ హైకమాండ్‌తో భేటీ కానున్నారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నిక సహా పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు.

నేడు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన పార్టీ హైకమాండ్‌తో భేటీ కానున్నారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నిక సహా పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల రద్దు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపైనా పెద్దలతో చర్చించనున్నారు. శుక్రవారం రాంచందర్ రావు జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి హైదరాబాద్ లోని ఎనిమిది నియోజకవర్గాల ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం సహా పలు అంశాలపై చర్చించారు. మరోవైపు జూబ్లిహిల్స్ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసేంది. ఈ కమిటీలో ముగ్గురు సీనియర్ నాయకులు ఉన్నారు. దీంతో పార్టీ ఎవరిని ఖరారు చేస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో రాంచందర్ రావు ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.

Next Story