అవమానపరిచే మాటలు మాట్లాడడం మంచిది కాదు: రాంచందర్​రావు

by Gantepaka Srikanth |

యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రగతి పథంపై పరుగులు పెడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు.

అవమానపరిచే మాటలు మాట్లాడడం మంచిది కాదు: రాంచందర్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రగతి పథంపై పరుగులు పెడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి వస్తుండటంతో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలకాలని కోరారు. మంగళవారం బహిరంగ సభ విజయవంతం కోసం తార్నకలో వాల్​రైటింగ్​క్యాంపెయిన్‌లో పాల్గొన్ని మాట్లాడుతూ.. బెంగాల్‌లో 100 సీట్లలో ఓట్ చోరీ జరిగిందని మమత విమర్శలు చేస్తే దీనికి రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓటు చోరి చేసేటోళ్లే చోరీ గురించి మాట్లాడుతున్నారని, వీళ్ళందరికీ చోరీ అలవాటు ఉంటే అప్పడు గెలిచారని, ఇప్పుడు వారి చోరీ నడవట్లేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల తీర్పుని అంగీకరించాలి, ప్రజలను అవమానపరిచే మాటలు మాట్లాడడం మంచిది కాదని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు సర్వశక్తివంతమైనది దానిని అవమాన పరుస్తుంటే కాంగ్రెస్ మద్దతు తెలపడం ఘోరమన్నారు. మూడు సార్లు మమతా గెలిచినప్పుడు తమ పార్టీ ఏమి అనలేదని, ప్రజా తీర్పును గౌరవించామన్నారు. కానీ వాళ్లు ఓడిపోతే ఈవీఎంలు, ఈసీఐ, దేశాన్ని నిందిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story