- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BJP: మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్–కాంగ్రెస్ కుట్రలు.. బీజేపీ ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణకు హాజరు కావాలని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ సీఎం కేసీఆర్ (KCR) విచారణకు వెళ్లాల్సిందేనని తెలంగాణ బీజేపీ స్టేట్ చీప్ రామచందర్ రావు అన్నారు. కేసీఆర్ చట్టాలను గౌరవించాలన్నారు. సీఎం హోదాలో ఉండగా నరేంద్ర మోడీ కూడా విచారణను ఎదుర్కొన్నారని ఆయన 10 గంటల పాటు సిట్ విచారించిందని గుర్తు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సిట్ విచారణకు వెళ్లేవారంతా షో చేస్తున్నారని వీరేమైనా ఫ్రీడమ్ ఫైటర్సా అని ప్రశ్నించారు. రేపో మాపో బీఆర్ఎస్ వారు జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్రలు:
ప్రజల ఫోన్లు ట్యాప్ చేసిందే కాకుండా డ్రామాలు చేస్తున్నారన్నారు. చివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసిపోవడం ఖాయం అని కానీ చట్టాలను గౌరవించి విచారణకు హాజరుకావాల్సిందే కదా అని ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో గెలుపొందిందని ఆరోపించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ లాంటిదని కారు సారు పదహారు అని గతంలో అన్నారని కానీ ఇప్పుడు సారు లేరు కారు గ్యారేజ్ కు పోయిందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కు అభ్యర్థులే లేరన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఇంకా దురంహాకారం పోలేదన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించిన ఇంకా తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని వారు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.






