- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పార్టీలో ఇంకా 650 పోస్టులున్నాయ్’.. రాజాసింగ్‌కు రాంచందర్ రావు కౌంటర్
ఇప్పుడున్న రాష్ట్ర కమిటీతో అసెంబ్లీ ఎన్నికలకు వెళితే.. బీజేపీ(BJP Telangana) తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడున్న రాష్ట్ర కమిటీతో అసెంబ్లీ ఎన్నికలకు వెళితే.. బీజేపీ(BJP Telangana) తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో పార్టీ కోసం కష్టపడే అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర కమిటీలో పేరు లేని బాధపడొద్దని సూచించారు. పార్టీలో ఇంకా 650 పోస్టులు ఉన్నాయని చెప్పారు. నిరాశలో ఉన్న వారిని పార్టీ కార్యక్రమాల్లో యాక్టీవ్ చేస్తామని అన్నారు. రాష్ట్ర కమిటీలో అన్ని ఉమ్మడి జిల్లాలకు న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. వరంగల్ జిల్లాకు అధికార ప్రతినిధి పదవితో న్యాయం చేస్తామని కీలక హామీ ఇచ్చారు. పార్టీలో ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు అని అన్నారు. తాము అధిష్టానం డైరెక్షన్‌కు అనుగుణంగా రాజాసింగ్ విషయంలో ముందుకు వెళ్తామని అన్నారు.






