- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలనలో ఫెయిల్: కాంగ్రెస్‌పై రాంచందర్‌రావు ఫైర్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని, సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలను నిజం చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు కేంద్రం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ అద్యక్షులు రాంచందర్ రావు విమర్శించారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని, సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలను నిజం చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు కేంద్రం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ అద్యక్షులు రాంచందర్ రావు విమర్శించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాయడం అత్యంత హాస్యాస్పదమన్నారు. రెండేళ్ల కాలంలో ఎంతో మంది కేంద్ర మంత్రులను కలిసిన రేవంత్‌రెడ్డి కిషన్‌రెడ్డికి చెప్పి కలిశారా అని నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థుల చదువులకు దూరమవుతూ భవిష్యత్తు భారంగా మారుతోందన్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేవని, పెన్షన్లు సక్రమంగా అందక రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులను ఎలా ప్రతిపాదించాలో కూడా తెలియదని, మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టు, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్టు, డీపీఆర్ లను ఇప్పటి వరకు సమర్పించలేదన్నారు. అవసరమైన సాంకేతిక పత్రాలు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని చెప్పడం అవాస్తవమని, కేంద్రం మెట్రో ఫేజ్-2కు వ్యతిరేకం కాదని, ఎప్పుడూ ప్రాజెక్టును తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ఇది కేంద్రం చేసిన 'రిజెక్షన్' కాదు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో ఆలస్యం జరిగిందని తేల్చిచెప్పారు. రుణాల చెల్లింపుల కంటే ముందు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశంపై, ప్రాజెక్టు నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని కేంద్రం సూచించిన సలహాలు పాటించకుండా, ఇప్పుడు కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ మెట్రోను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని, మెట్రో ఫేజ్-1ను ప్రధాని మోడీ ప్రారంభించారని, ఫేజ్-2కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది కూడా కేంద్రమేనని చెబుతూ మెట్రో విస్తరణ ఆలస్యానికి కేంద్రం, కిషన్ రెడ్డి కారణం కాదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. పరిపాలనలో ఫెయిల్ అయి, ప్రచారంలో పాస్ కావాలనే ప్రయత్నంలో, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దాచేందుకే ఈ రాజకీయ డ్రామాలని ఆరోపించారు.
ఈసందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన సీనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి, సినీ నిర్మాత బండి శ్రీనివాస్ పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.






