- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ramchander Rao: ఆ పథకాలతో మహిళల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు
మోడీ ప్రారంభించిన భేటీ బచావో, భేటీ పడావో పథకంతో సమాజంలో పెద్ద మార్పు వచ్చిందని రాంచందర్ రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలోని మహిళలకు అపార గౌరవం, అవకాశాలు లభిస్తున్నాయని, నారీ శక్తి అనేది బీజేపీ నినాదం మాత్రమే కాదని, దేశ నిర్మాణానికి సంబంధించిన ఒక జాతీయ మిషన్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర మహిళ మోర్చా విభాగం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హజై ప్రసంగించారు. మోడీ ప్రారంభించిన భేటీ బచావో, భేటీ పడావో పథకం సమాజంలో పెద్ద మార్పు వచ్చిందన్నారు. నేడు ఆడబిడ్డలను కాపాడడమే కాకుండా వారికి విద్య, సాధికారత కల్పించే దిశగా దేశం ముందుకు సాగుతోంది.
కేంద్ర ప్రభుత్వం మహిళల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకువచ్చే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పీఎం ఉజ్వల యోజనతో కోట్లాది కుటుంబాలు ఎల్‌పీజీ సౌకర్యం పొందాయని, గ్యాస్ వాడకంతో గృహ వాయు కాలుష్యం తగ్గి, మహిళల ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ఆవాస్ యోజనతో కోట్లాది మంది పేద కుటుంబాలకు పక్కా ఇల్లు కల్పిస్తూ, మహిళల పేరుతో ఇంటి హక్కు, తక్కువ వడ్డీతో రుణాలు, అధిక సబ్సిడీ కల్పిస్తూ సొంతింట కలను సాకారం చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా బీజేపీ మద్దతుతో ఎన్నుకోవడం జరిగింది. సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన మహిళలను సాధికారత కల్పించాలనే బీజేపీ సంకల్పానికి నిదర్శనమన్నారు. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టం దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండగా, కొత్త పార్లమెంట్ భవనంలో తొలి రోజే దీనిని ఆమోదింపజేసి మోడీ ప్రభుత్వం మహిళా సాధికారతపై తన నిబద్ధతను చాటిచెప్పిందన్నారు. తెలంగాణలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని గృహ హింసతో పాటు ఇతర నేరాల కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డారు. చదువుకున్న మహిళలు, యువ మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన సమయం వచ్చిందన్నారు.






