పసికందును తొక్కి చంపుతారా?.. కాంగ్రెస్ నేతలపై రాంచందర్ రావు ఫైర్

by Gantepaka Srikanth |

నాగర్ కర్నూరు జిల్లాలోని నిర్వహించిన కుమ్మెర మల్లన్న జాతరలో కాంగ్రెస్ గుండాల పాశవిక దాడికి ఓ పసికందు బలైపోవడం తెలంగాణ సమాజాన్ని నివ్వెరపరిచిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు.

పసికందును తొక్కి చంపుతారా?.. కాంగ్రెస్ నేతలపై రాంచందర్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూరు జిల్లాలోని నిర్వహించిన కుమ్మెర మల్లన్న జాతర(Kummera Mallanna Jatara)లో కాంగ్రెస్ గుండాల పాశవిక దాడికి ఓ పసికందు బలైపోవడం తెలంగాణ సమాజాన్ని నివ్వెరపరిచిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) పేర్కొన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఈ కిరాతక ఘటనపై రాంచందర్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్-మౌనిక దంపతుల కడుపుకోతకు, రాష్ట్రంలో అడుగంటిన శాంతిభద్రతలకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. హోంశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నా, ఇంతటి ఘోర ఘటనపై సీఎం మరియు అధికార పార్టీ నేతలు మౌనం వహించడం వారి చేతకానితనానికి నిదర్శన అని మండిపడ్డారు.

ఘటనపై బీజేపీ డిమాండ్స్..

1. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.

2. బాధిత కుటుంబంపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించాలి.

3. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ప్రజలకు బహిర్గతం చేయాలి.

4. సమగ్రంగా మరియు నిష్పాక్షికంగా మేజిస్ట్రియల్ విచారణ జరపాలి.

5. తమ విధుల్లో నిర్లక్ష్యం చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.

6. బాధిత కుటుంబానికి తక్షణ ఎక్స్‌గ్రేషియా సహాయం ప్రకటించాలి.

7. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కేటాయించాలి.

8. శోకసంద్రంలో ఉన్న తల్లిదండ్రులకు దీర్ఘకాలిక ఆర్థిక మరియు సామాజిక భరోసా కల్పించాలి.

పసికందు ఉసురు తీసిన ఈ పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తక్షణమే న్యాయం జరగకపోతే బీజేపీ పక్షాన రాష్ట్రవ్యాప్త ప్రజా ఉద్యమం తప్పదని రాంచందర్ రావు హెచ్చరించారు.

Next Story