- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ramchander Rao: గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు ఉండదు
కాంగ్రెస్ పార్టీ దేశానికి అనుకూలంగా మాట్లాడకపోయినా, కనీసం ప్రజల్లో భయాందోళనలు కలిగించే తప్పుడు ప్రచారం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అద్యక్షులు రాంచందర్‌రావు సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ దేశానికి అనుకూలంగా మాట్లాడకపోయినా, కనీసం ప్రజల్లో భయాందోళనలు కలిగించే తప్పుడు ప్రచారం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అద్యక్షులు రాంచందర్‌రావు సూచించారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఇతర పార్టీలకు చెందిన వందలాది కార్యకర్తలు పార్టీలో చేరడంతో వారి ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశ రాష్ట్రపతిని గౌరవించకుండా, ప్రోటోకాల్ పాటించకుండా ఆ పార్టీ వ్యవహరిస్తోంది. 2012లో ఇరాన్ భారత్‌కు ఆయిల్ సరఫరా నిలిపివేసిందని 2005లో యూపీఏ ప్రభుత్వం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడమే కారణమన్నారు. ఆ నిర్ణయం భారత్–ఇరాన్ సంబంధాలను దెబ్బతీసి క్రూడ్ ఆయిల్ దిగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 2012–13లో ఇరాన్‌పై ఆంక్షలు విధించిన తర్వాత భారత్‌కు వచ్చే ఆయిల్ దిగుమతులు సుమారు 26.5 శాతం వరకు పడిపోయాయి.
బాధ్యత యూపీఏ ప్రభుత్వానిదే..
ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత యూపీఏ ప్రభుత్వానిదే అన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు ఇరాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ, భారతదేశంలో చమురు కొరత ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూపీఏ హయాంలో భారత్ కేవలం 16 దేశాల నుంచి మాత్రమే ఆయిల్ దిగుమతి చేసుకునేదని మోడీ అధికారం చేపట్టిన తరువాత ఆ సంఖ్యను 40 దేశాలకు పెరిగిందన్నారు. మహిళలకు గ్యాస్ సిలిండర్ ధరలపై ఎటువంటి ప్రభావం ఉండదు. దేశంలో తగినంత బఫర్ స్టాక్ ఉందని ఇంపోర్ట్ కవరేజ్ కూడా పెరిగిందన్నారు. ప్రస్తుతం ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. చైనాతో రహస్య ఒప్పందాలు చేసినది కాంగ్రెస్ పార్టీనేని అటువంటి చర్యలు వారి ఉద్దేశాలపై అనుమానాలు కలిగిస్తున్నాయి.
తెలంగాణలో ఖజానా ఖాళీ అయిందంటూ ప్రతిరోజూ కథలు చెబుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అదే సమయంలో ప్రజల ధనంతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేయడం సరికాదన్నారు. కేరళలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ , కేరళలో మాత్రం ఆర్భాట ప్రచారం చేయడం తెలంగాణ ప్రజలను అవమానించే చర్యగా ఉందన్నారు. బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు. తెలంగాణలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.






