- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజాసింగ్ గురించి నేను మాట్లాడను..రామచందర్ రావు షాకింగ్ కామెంట్స్
ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి తాను మాట్లాడనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు షాకింగ్ కామెంట్లు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో రామచందర్ రావు పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి తాను మాట్లాడనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు షాకింగ్ కామెంట్లు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో రామచందర్ రావు పాల్గొన్నారు. ధర్మపురి అరవింద్‌తో తాను స్వయంగా మాట్లాడానని అన్నారు. ఆయన వేరే పనివల్ల మీటింగ్ కు రావట్లేదని చెప్పారన్నారు. ఈటల రాజేందర్ కూడా మీటింగ్‌కు వచ్చానని చెప్పారు. అందరూ వచ్చారని రానివారి గురించి పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.
పార్టీ అధ్యక్ష పదవి ఒక్కటే ఉంటుందని, కానీ ఆశావహులు ఎక్కువ మంది ఉంటారని అన్నారు. పార్టీ పెరిగింది కాబట్టి పోటీ కూడా పెరిగిందని చెప్పారు. ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా తాను వాళ్లతో కలిసి పనిచేయాలనే ఆలోచనతోనే ఉన్నానని అన్నారు. ఈ రోజు వాళ్లు కూడా అలానే ఉన్నారని చెప్పారు. తమ పార్టీలో అభిప్రాయ భేదాలు లేవని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంలో ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, డీకే అరుణతో కలిసి పని చేస్తామని చెప్పారు. తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పారు.






