- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ క్షణంతో మున్సిపల్ఎన్నికలు వచ్చిన దీటుగా ఎదుర్కొంటాం : బీజేపీ చీఫ్రాంచందర్రావు
రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు ఏ క్షణంలో ఎన్నికలు జరిగిన ఎదుర్కొనడానికి బిజెపి సిద్దంగా ఉందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిజెపి సిద్ధంగా ఉండాలనే సంకల్పంతోనే ఈ విజయ్ సంకల్ప సమ్మేళనం నిర్వహించుకున్నామని తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు ఏ క్షణంలో ఎన్నికలు జరిగిన ఎదుర్కొనడానికి బిజెపి సిద్దంగా ఉందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిజెపి సిద్ధంగా ఉండాలనే సంకల్పంతోనే ఈ విజయ్ సంకల్ప సమ్మేళనం నిర్వహించుకున్నామని తెలిపారు. శనివారం నగరంలోని సికింద్రాబాద్క్లాసిక్గార్డెన్లో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల విజయ్సంకల్పం సమ్మేళనం ఘనంగా నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మొదటిసారిగా సుమారు వెయ్యి మంది సర్పంచులను గెలుచుకున్నామన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పోటీ కేవలం కాంగ్రెస్ , బిజెపి మధ్యే ఉందని, ప్రజలు కూడా ఈ రెండు పార్టీలనే ప్రత్యామ్నాయాలుగా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పూర్తిగా కనుమరుగైంది. త్వరలో ఆ పార్టీ ముక్కలవ్వడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం, రావడం బహిరంగ సభలు పెట్టడం తప్ప పాలనపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే అభివృద్ధి జరుగుతోంది. గత 11 ఏళ్లలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ. 12 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. రేషన్ షాపుల్లో సీఎం ఫోటో మాత్రమే పెట్టి రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోందన్న తప్పుడు ప్రచారం చేస్తోంది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసినదంతా శూన్యం. గతంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరింతగా దోచుకుంటోందని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లేది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. కేంద్రం సమయానికి యూరియాను పంపిస్తుంటే, దానిని కూడా కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని దీని ముందు చక్కబెడితే ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. మోడీ ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా, కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. తెలంగాణ ప్రజలు బాగాఆలోచించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని అత్యధిక స్థానాల్లో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని సూచించారు. మన భవిష్యత్తు బాగుండాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే, పేదలకు ఇండ్లు రావాలంటే, ఆరోగ్య భద్రత కావాలంటే- అది కేవలం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల ద్వారానే సాధ్యం. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయం మన మొదటి మెట్టు కాగా, రెండో మెట్టు రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడమే అన్నారు.
ఒక్క ఛాన్స్ ఇస్తే మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అభివృద్ది ఏమిటో చూపిస్తా : కేంద్ర మంత్రి బండి
రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేకి ఒక అవకాశం ఇస్తే అభివృద్ది ఏమిటో తాము చూపిస్తామన్నారు. అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిపిస్తే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని ఒప్పించి కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొస్తామన్నారు. అవసరమైతే సీఎస్సార్ నిధులు తెచ్చి బీజేపీ పాలిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ది చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్రం రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నయాపైసా కూడా పట్టణ స్థానిక సంస్థల్లో ఖర్చు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ‘జై శ్రీరాం’ అంటే కూడా భయపడుతోంది. జై శ్రీరాం బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.. చెక్ చేసుకోవాలని ఎంపీ అరవింద్ అంటే గాంధీ భవన్ లో బీజేపీ సభ్యత్వాలపై ఆరా తీస్తున్నారని, శ్రీరాం వారసులు బీజేపీ వాళ్లేనని జనమే గుర్తించారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 15లోపు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈనెల 28లోపు షెడ్యూల్ వెలువడే అవకాశముందని చర్చ జరుగుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు లక్కీ హ్యాండ్. రాష్ట్రమంతా బీజేపీకి మంచి వాతావరణం ఉంది. గతం కంటే అధిక పంచాయతీ స్థానాలను గెలుచుకున్నాం. అర్బన్ లో బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటాం. ఆయన ఆధ్వర్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్, నిజామాబాద్, బైంసా, నిర్మల్ వంటి ప్రాంతాల్లో బీజేపీ గెలుస్తుందనే సర్వేలు చెబుతున్నాయి. కానీ డీలిమిటేషన్ పేరుతో ఓట్లను తారుమారు చేసి ఎంఐఎంకు ఎక్కువ సీట్లు వచ్చేలా కాంగ్రెస్ కుట్ర చేసింది. మజ్లిస్ పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం కాంగ్రెస్ తో, ఇంకో వర్గం బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ కు 10, 12 సీట్లు వచ్చినా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ సహకారంతో మేయర్ సీటును కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. అదే సమయంలో ఆ పార్టీలకు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్దానిక నాయకులు వాడ వాడలా వెళ్లి ప్రజలు సమస్యలు ఉన్న చోటకు వెళ్లి బీజేపీని గెలిపిస్తే ఆ సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇవ్వాలని సూచించారు. ఒక్కో ఇంటికి 6 సార్లు వెళ్లడంతో పాటు ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పైసలను నమ్ముకుని గెలవాలనుకుంటున్నాయి. బీజేపీ మాత్రం ప్రజలనే నమ్ముకుని ఎన్నికలకు వెళుతోంది. టిక్కెట్లు రానివారు బాధపడొద్దు. వాళ్లకు పార్టీ పదవులతోపాటు అవసరమైతే నామినేటెడ్ పదవులిస్తాం. కలిసి కట్టుగా పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగర వేయాలని సూచించారు.
సికింద్రాబాద్ కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ చేయాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జంట నగరాల్లో సికింద్రాబాద్ఎన్నో సంవత్సరాలుగా అన్నింటికీ కేంద్రంగా ఉందని, అలాంటి సికింద్రాబాద్ పేరు లేకుండా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తుండటం సరికాదన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
సంగీత డైరెక్టర్ఏఆర్ రెహ్మాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, తాను ముస్లిం కావడంతో అవకాశాలు రాలేదనడం తప్పుడు కామెంట్స్చేశారని పేర్కొన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందర్భంలో అభిమానులెవరూ ఆయన ముస్లిమా, హిందువా అని చూడలేదని, మరి ఇప్పుడెందుకు, అలాంటి భేదాలుంటాయని ప్రశ్నించారు. రెహ్మాన్ లాంటి గొప్ప కళాకారుడు చేయాల్సిన కామెంట్స్ ఇవి కావని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.






