తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ క్లారిటీ

by Ajay Maddhiboyina |

తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ క్లారిటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు క్లారిటీ ఇచ్చారు. ఎప్పటిలాగే స్థానిక ఎన్నికల్లోనూ ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగిల్ గానే పోటీచేస్తామని చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల అనారోగ్య పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.

హాస్టళ్లలో విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదని, కలుషిత ఆహార ఘటనలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలోనూ టీడీపీని విస్తారిస్తామని చంద్రబాబు, జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పడంతో ఇక్కడ కూడా మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిపై రామచందర్ రావు క్లారిటీ ఇవ్వడంతో పొత్తులు ఉండవని స్పష్టం అయ్యింది.

Next Story