New CS Ramakrishna Rao : సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు

by Muthe.Rajitha |   (  Updated:2025-04-30 11:24:17  IST  )

తెలంగాణ నూతన సీఎస్ గా కే.రామకృష్ణారావు(New CS Ramakrishna Rao) బాధ్యతలు స్వీకరించారు.

New CS Ramakrishna Rao : సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ నూతన సీఎస్ గా కే.రామకృష్ణారావు(New CS Ramakrishna Rao) బాధ్యతలు స్వీకరించారు. శాంతికుమారి నేడు పదవీ విరమణ చేశారు. దీంతో సీఎస్ గా రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. 1991 బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు గతంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. సుధీర్ఘకాలం ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఆయనను సీఎస్ గా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నియమించినట్టు సమాచారం. కాగా రామకృష్ణారావు వచ్చే ఆగష్టులో పదవీ విరమణ చేయనున్నారు.

ఇక ఇదివరకు సీఎస్ గా బాధ్యతలు నిర్వహించిన శాంతి కుమారికి మరో కీలక బాధ్యతలు అప్పజెప్పింది ప్రభుత్వం. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల విభాగం వైస్ ఛైర్మన్ గాను, ఎంసీఆర్హెచ్ఆర్డీ జనరల్ డైరెక్టర్ గాను బాధ్యతలు కట్టబెట్టింది.

Next Story