- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామగుండం యూరియాను తెలంగాణకే కేటాయించాలి: మంత్రి తుమ్మల
గత ఖరీఫ్ సీజన్‌లో రామగుండంలో ఎరువుల ఉత్పత్తి నిలిచిపోవడంతో రైతులకు యూరియా సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గత ఖరీఫ్ సీజన్‌లో రామగుండంలో ఎరువుల ఉత్పత్తి నిలిచిపోవడంతో రైతులకు యూరియా సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ నుంచి 2,05,315 మెట్రిక్ టన్నుల కేటాయింపులకు కేవలం 1,10,720 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా కావడంతో లోటు ఏర్పడిందని తెలిపారు. ఈ లోటును భర్తీ చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరినప్పటికీ సమయానికి స్పందన లేకపోవడంతో రైతులు నష్టపోయారని అన్నారు. మంగళవారం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు , ఆర్ఎప్సీ ఎల్అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రబీ సీజన్‌కు సంబంధించి ఆసంస్ధ తీసుకుంటున్న చర్యలు, ఉత్పత్తిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చేపడుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. రామగుండంలో నెలకు సుమారు లక్ష టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నప్పటికీ తెలంగాణకు కేవలం 40 నుంచి 50 శాతం మాత్రమే కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 70 శాతం అయినా తెలంగాణకే కేటాయిస్తే రవాణా ఖర్చులు తగ్గి, రైతులకు వేగంగా ఎరువులు అందించవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని పరిశ్రమల శాఖ ఎండీని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.
అలాగే ఉత్పత్తిలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఎన్ఎఫ్ఎల్ కంపెనీ ప్రతినిధులను మంత్రులు ఆదేశించారు. స్పందించిన కంపెనీ ప్రతినిధులు, గత ఖరీఫ్‌లో హెచ్‌టీ ఆర్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిందని, రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు చింతిస్తున్నామని తెలిపారు. ఈ రబీలో ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో కేటాయింపుల మేరకు యూరియాను సరఫరా చేశామని, డిసెంబర్ నెలలో కూడా 50,450 మెట్రిక్ టన్నుల సరఫరా చేయనున్నట్లు తెలిపారు.






