రామచంద్రరావు మాటలు అర్థం లేనివి : మంత్రి తుమ్మల

by Muthe.Rajitha |

రాష్ట్రానికి యూరియా సరఫరాలపై బీజేపి అధ్యక్షులు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామచంద్రరావు మాటలు అర్థం లేనివి : మంత్రి తుమ్మల
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రానికి యూరియా సరఫరాలపై బీజేపి అధ్యక్షులు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయరంగంపై కనీసం అవగాహన లేకుండా, ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడుగా ఉంటూ ఎలాంటి నిజనిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం హాస్యస్పదంగా ఉందన్నారు. కేంద్రం రాష్ట్రానికి 12 లక్షల మెట్రిక్​టన్నుల యూరియా సరఫరా చేసిందని చెప్పడం వారికి, వారి పార్టీకి తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల ఉన్న నిబద్ధత బయటపడిందన్నారు. రైతుల విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావివ్వకూడదని ఎన్నిసార్లు తాను విన్నవించిన, వారి వైఖరి మారడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు యూరియా కోసం తిప్పలు పడుతుంటే, బీజేపీ నేతలు గొప్పలు చేసినట్టుగా చెప్పుకుంటున్నారని అది వారి అవివేకానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి కేంద్రం ఈ ఖరీఫ్ సీజన్ కు కేవలం 9.80 ఎల్ఎంటీల యూరియా మాత్రమే కేటాయింపులు చేసిందని, ఇది కూడా తెలియకుండా 12 ఎల్​ఎంటీల యూరియాను సరఫరా చేసిందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలన్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు లెక్కలతో సహా కేంద్ర రసాయన మంత్రికి, రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులకు లేఖలు రాసినట్లు గుర్తు చేశారు.

Next Story