- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు ఏకగ్రీవం
బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి అయిన కేంద్ర మంత్రి శోభా కరండ్లాజే ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామందర్‌రావు (Former MLC Ramander Rao) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి అయిన కేంద్ర మంత్రి శోభా కరండ్లాజే (Shobha Karandlaje) ప్రకటించారు. నిన్న అనూహ్య పరిణామాల మధ్య జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు రామచందర్‌రావు అధ్యక్ష పదవికి రెండు సెట్ల నామినేషన్లు వేశారు. అలాగే అప్పటి వరకు పోటీలో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్, దర్మపురి అరవింద్, బండి సంజయ్‌లు నామినేషన్ వేయలేదు. అయితే ఎమ్మెల్యే రాజా సింగ్ నామినేషన్ వేయడానికి ప్రయత్నించినప్పటికీ కౌన్సిల్ సభ్యుల బలం లేకపోవడంతో ఆయన నామినేషన్ స్వీకరించలేదు. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రామందర్‌రావు ఒక్కడే నామినేషన్లు సమర్పించడంతో.. ఆయన ఏకగ్రీవంగా (Unanimously) ఎన్నికైనట్లు శోభా కరండ్లాజే ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించారు. దీంతో రామందర్‌రావు.. కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Read More... Kishan Reddy: ఆ సన్నాసుల గురించి పట్టించుకోకండి.. కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్






