- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సనాతన ధర్మాన్ని మార్చలేరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సూర్యాపేట జిల్లా హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డుబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సూర్యాపేట జిల్లా హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డుబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని అన్నారు. దక్షిణ తెలంగాణ బీజేపీ బలోపేతం కావడం శుభపరిణామం అని చెప్పారు. విద్యావంతులు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పుకోరుకుంటున్నారని అన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో చాలా దేశాలు ముస్లిం, క్రిస్టియన్ దేశాలుగా మారాయని కానీ సనాతన ధర్మాన్ని ఎవరూ ఏం చేయలేకపోయారన్నారు.
దేశాన్ని విడగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, సనాతన ధర్మాన్ని ఎవరూ మార్చలేరని వ్యాఖ్యానించారు. యువత పేరుతో దేశాన్ని విడగొట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. అమెరికా, దుబాయ్ లాంటి దేశాల నుండి ఫండింగ్ జరుగుతోందని అన్నారు. దేశం ఐక్యత కాపాడాలంటే ప్రజలు అంతా కలిసి ఉండాలని చెప్పారు. సర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే సహించం అని చెప్పారు. సర్ ప్రక్రియ ప్రతి పదేళ్లకు ఒకసారి జరుగుతుందని, దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.






