- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మజ్లిస్ పార్టీకి లబ్ధి కోసమే.. మున్సిపాలిటీల విలీనంపై రామచందర్‌రావు తీవ్ర ఆరోపణలు
జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నామని బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్‌రావు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నామని బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్‌రావు తెలిపారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్ సర్కార్, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లో విలీనం చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
ఎంఐఎం నాయకుల చేతుల్లో GHMC ని అప్పగించి, వాళ్ళను మేయర్ చేయడమే ప్రధాన లక్ష్యంగా, ప్రజల అభివృద్ధి కాకుండా, వారి రియల్ ఎస్టేట్ వ్యాపారాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం దురాలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే మున్సిపాలిటీల విలీనం అని తీవ్ర ఆరోపణలు చేశారు.
మున్సిపాలిటీల విలీనం అశాస్త్రీయంగా ఉందని, విలీనంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హితువుపలికారు. కాగా, జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నిర్ణయంపై బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.






