- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్తో పొత్తుపై టీబీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్‌తో పొత్తు ప్రచారాన్ని తెలంగాణ బీజేపీ నేత రామచందర్ రావు ఖండించారు. దేశంలో చమురు కొరత రాదని ధీమా వ్యక్తం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‍తో (BRS) ఎట్టిపరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‍రావు (Ramachander Rao) స్పష్టం చేశారు. ఇది వాస్తవం అని పొత్తుల విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‍లో పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామచందర్ రావు.. రాష్ట్ర ప్రజలు ఒక సారి బీఆర్ఎస్, మరోసారి కాంగ్రెస్‍కు అవకాశం ఇచ్చారని ఈసారి బీజేపీకి చాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ ను ఎంఐఎంకు ధారాదత్తం చేస్తున్నాయని విమర్శించారు.
రాహుల్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు
ఇరాన్ యుద్ధం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఓ రకమైన భయాన్ని సృష్టిస్తోందని, రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఈ యుద్ధం వల్ల మన దేశంలో చమురు ఇబ్బందులు తలెత్తవని మనకు సరిపడ చమురు నిల్వలు ఉన్నాయన్నారు. 2014కు ముందు మన దేశం 16 దేశాల నుంచి మాత్రమే ముడి చమురు కొనుగోలు చేసేదని కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దూరదృష్టితో 47 దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తోందని అందులో రష్యా కూడా ఉందన్నారు. అందువల్ల యుద్ధం వల్ల మన దేశంలో చమురు కొరత రాదన్నారు.
నాడు వ్యతిరేకంగా ఓటు వేసింది మీరు కాదా?
2005లో నాటి యూపీఏ ప్రభుత్వం ఇరాన్ కు వ్యతిరేకంగా ఐఏఈఏలో ఓటు వేసిందని దీంతో నాడు ఇరాన్ మన దేశానికి క్రూడాయిల్ నిలిపివేసింది. ఇది ఆన్ రికార్డు అన్నారు. ఇప్పుడు మళ్లీ వీళ్లే ఇరాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
Next Story






