- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేనలోకి సినీ నటి.. కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ ప్రధాన కార్యదర్శి
జనసేన పార్టీలోకి సినీ గ్లామర్ వచ్చి చేరింది. ప్రముఖ మోడల్, సినీ నటి, పవన్ కల్యాణ్ వీరాభిమాని శుక్రవారం జనసేన పార్టీలో అధికారికంగా చేరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీలోకి సినీ గ్లామర్ వచ్చి చేరింది. ప్రముఖ మోడల్, సినీ నటి, పవన్ కల్యాణ్ వీరాభిమాని నివితా మనోజ్ శుక్రవారం జనసేన పార్టీలో అధికారికంగా చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై, ఆయన నాయకత్వంలో పని చేసేందుకు ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
మోడలింగ్ నుంచి వెండితెర వరకు..
కాగా, నివితా మనోజ్ తెలుగు చిత్రసీమలో వర్ధమాన నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’లో కీలక పాత్ర పోషించిన ఆమె, అంతకుముందు ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ (2009) చిత్రాల్లో నిలిచారు.
పవన్ కల్యాణ్ వీరాభిమానిగా..
నివితా మనోజ్ కేవలం నటిగానే కాకుండా, పవన్ కల్యాణ్ పట్ల తనకున్న అపారమైన అభిమానంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. 'హరి హర వీరమల్లు' చిత్రానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కి ఆమె తన భక్తిని చాటుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ తాగిన వాటర్ బాటిల్‌ను తాను గుర్తుగా దాచుకున్నానని చెప్పడం అప్పట్లో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. కాగా, వృత్తిరీత్యా హోటల్ మేనేజ్‌మెంట్ చదివిన నివిత, గత 15 ఏళ్లుగా మోడలింగ్ రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 50కి పైగా ర్యాంప్ షోలలో పాల్గొన్న ఆమె, రిలయన్స్ జ్యువెలరీ వంటి దిగ్గజ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. యాంకర్‌గా, ఈవెంట్ ప్రెజెంటర్‌గా కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉంది.






