- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
High Court: డ్రగ్స్ కేసు కొట్టేయండి.. హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు
డ్రగ్స్ కేసులో రకూల్ ప్రీత్ సింగ్ సోదరుడు హైకోర్టును ఆశ్రయించాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: డ్రగ్స్ కేసులో (Drugs Case) తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ (Aman Preet Singh) తెలంగాణ హైకోర్టును (Telangana High Court) ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో ఏ7 గా ఉన్న అమన్ ప్రీత్ సింగ్ కు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నట్లు విచారణలో తేలడంతో ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో తనకు డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధం లేదని వాదిస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు. కాగా గత నెల 19న హైదరాబాద్ బంజారాహిల్స్ సమీపంలోని మాల్ వద్ద ఈగల్, మాసబ్‌ట్యాంక్ పోలీసులు మాదకద్రవ్యాలు రెయిడ్స్ నిర్వహించారు. ఈసందర్భంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న నితిన్ సింఘానియా, షర్నిక్ సంఘీలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 43.7 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల సెల్‌ఫోన్లలో దొరికిన సమాచారం ప్రకారం అమన్ ప్రీత్ సింగ్ నెలరోజుల వ్యవధిలో ఆరుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.






